ANDHRA PRADESHCRIME NEWS
మనస్తాపం తో యువతి ఆత్మహత్య

నా అనే వాళ్ళు అందరు దూరం కావటం వల్లే మనస్థాపంతో యువతి ఆత్మహత్య
చేసుకుంది
జి .మడుగుల జూన్ 14 యువతరం న్యూస్:
కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయితీ బొడ్డు మామిడి లంకకు చెందిన కుండ్ల రాధమ్మ పంతొమ్మిది అనే యువతి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది రాధమ్మ చిన్నతనంలో తల్లి చనిపోయింది ఆ తర్వాత సోదరుడు మృతి చెందాడు తనను ఎంతో అపురూపంగా చూసుకునే నానమ్మ ఇటీవల చనిపోయింది ఈ నేపథ్యంలో నా అనుకున్న వాళ్లు నాకంటూ ఎవరూ లేరు అన్ని మనస్తాపానికి గురై రాధమ్మ గురువారం ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు కి ఇలా జరగడం చాలా బాధాకరం అని స్థానికులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మoప ఎస్సై లోకేష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.