ఆర్థిక సహాయం చేసిన చొక్కాల గ్రామ ప్రజలు

ఆర్థిక సహాయం చేసిన చొక్కాల గ్రామ ప్రజలు
వాజేడు జూన్ 14 యువతరం న్యూస్ :
ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామం డ ర్ర సునీత
తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతంలో నిన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడి కాలు సైతం పోగొట్టుకున్నటువంటి డర్ర సునీతను పరామర్శించి హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామ ప్రజలు అందరూ కలిసి వాడ బలిజ సేవా సంఘం తరపున మరియు ఇతరుల సహాయ సహకారాలతో వి ఆర్ కె పురం యూత్ అందరూ కలిసికట్టుగా సంఘాలు వసూలు చేసి నిరుపేద కుటుంబమైన డర్ర సునీత హాస్పిటల్ ఖర్చుల కొరకు అక్షరాల 1,20,000 రూపాయలను సునీత భర్త మహేష్ కి అందజేశారు, అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట రావు జాగృతి హాస్పిటల్ కి వచ్చి
బాధితురాలిని పరామర్శించారు,
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, డర్ర దామోదర్, తోట నాని, డర్ర రవి, సనగొండ పోతురాజు, డర్ర రాంప్రసాద్, దివాకర్, ప్రశాంత్, వెంకటేష్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.