ప్రపంచ రక్త దాన దినోత్సవ సందర్భంగా రింతాడ మన్యపుత్ర యువజన సంఘం

ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రింతాడ మన్యపుత్ర యువజన సంఘం
జి.మాడుగుల జూన్ 14 యువతరం న్యూస్:
చేయూత వారియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ఇండియా బ్లడ్ బ్యాంక్ పాడేరు వారి సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్త వీధి మండలం,రింతాడ గ్రామం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ శిబిరంలో నాబైఎనిమిది మంది రక్తదాతలు రక్తం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లూరి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణారావు డాక్టర్ దిలీప్ కుమార్ జీకే వీధి ఎస్సై అప్పలసూరి పంచాయతీ సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి గ్రామ పెద్దలు
నాయకులు వెంకటేశ్వర్లు శరభన్నదొర సంజీవరావు బొబ్బిలి లక్ష్మణ్,వెంకట్రావు పాండ్రాజు యం రాజబాబు హాజరయ్యారు.
ఈ రక్తదానం కార్యక్రమం విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు రక్తదాతలకు మన్యపుత్ర యువజన సంఘం అధ్యక్షుడు మడపల సోమేష్ కుమార్ మరియు చేయూత వారియర్ ట్రస్ట్ చైర్మన్ దునబోయిని రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు చింతపల్లి వర్తక సంఘ అధ్యక్షుడు పేదిరెడ్డి బేతాళుడు వారి కుమారుని జ్ఞాపకార్థంగా రక్తదానం చేసిన వారికి మెమొంటో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు సర్టిఫికెట్స్ అందజేశారు
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది అప్పారావు వెంకట్ సతీష్ చిన్ని దిలీప్ లోహితాష్ వెంగడ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ మన్యపుత్ర యువజన సంఘ సభ్యులు రాజేష్ కుమార్ ప్రసాద్ అర్జున్ సాయి కుమార్ చిన్నారావు మురళి శేఖర్ శివాజీ శ్రీను ప్రకాష్ చందర్రావు పద్మ శ్రీను చేయూత వారియర్స్ ట్రస్ట్ సభ్యులు గిరి నాగు చిన్న తదితరులు పాల్గొన్నారు.