SOCIAL SERVICETELANGANA

వెంకటాపురం స్వచ్ఛంద సేవా సంస్థకు రెండవ అవార్డు

వెంకటాపురం స్వచ్ఛంద సేవా సంస్థకు రెండవ అవార్డు

ప్రపంచ 20వ రక్తదాన శిబిరం సందర్భంగా హైదరాబాద్ లోని సంస్కృతి రాజ్ భవన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.

వాజేడు జూన్ 14 యువతరం న్యూస్

ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.తెలంగాణ స్టేట్ రెడ్ క్రాస్ చైర్మన్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, రెడ్ క్రాస్ సెక్రెటరీ మధన్ మోహన్ ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఎక్కువ రక్తం దాన శిబిరాలు చేసిన సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థకు రెండు అవార్డు రావడం జరిగింది.
ఎక్కువ రక్తదాన శిబిరాలు పెట్టినందుకు గాను ఎక్కువమందిని మోటివేట్ చేసి హైయెస్ట్ మోటివేషన్ అవార్డు ఎక్కువ యూనిట్స్ భద్రాచలం రెడ్డి క్లాస్ సొసైటీకి ఇప్పించినందుకు గాను రెండు అవార్డులు తెలంగాణ రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ తెలంగాణ స్టేట్ రెడ్ క్రాస్ చైర్మన్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, రెడ్ క్రాస్ సెక్రెటరీ మదన్ మోహన్ చేతుల మీదుగా చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడికి ఫ్రెండ్ మెమొరంటంలో అప్రిషియేట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కు అవార్డుకు కారణమై తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ రక్తదాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల యొక్క డైరెక్టర్లు చైర్మన్లు ఎమ్మెల్యేలు హెల్త్ డైరెక్టర్లు తెలంగాణ రెడ్ క్రాస్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!