ANDHRA PRADESHWORLD
పీడిత ప్రజల పోరాట చిహ్నం చేగువేరా

పీడిత ప్రజల పోరాట చిహ్నం చేగువేరా..
దేవనకొండ జూన్ 14 యువతరం న్యూస్:
దేవనకొండ సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ విప్లవ కారుడు చేగువేరా 96వ జయంతిని జరుపుకున్నారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శరత్ మాట్లాడుతూ గుండెల్లో దాగి ఉన్న నిప్పుతో, కళ్ళల్లో ధైర్యపు జ్యోతితో, అణగారిన ప్రజల కోసం, పోరాడిన విప్లవ వీరుడు చేగువేరా. ఆయన మాటలు ఒక శక్తి చేతలు ఒక స్ఫూర్తి. ఆ పేరు ఒక నినాదం. అయన జీవితం ఒక పాఠం. ఏర్నెస్టో “చే” గువేరా ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతవేత్త, క్యూబా విప్లవంలో ప్రముఖ వ్యక్తి అని అన్నారు. యువతకు చేగువేరా ఒక ఆదర్శమన్నారు