దేవనకొండలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలు

దేవనకొండలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలు..
నిద్రా వ్యవస్థలో మండల విద్యాశాఖాధికారులు..
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్
దేవనకొండ జూన్ 14 యువతరం న్యూస్:
దేవనకొండ మండలంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓ-1 తిమ్మారెడ్డి,ఎంఈఓ-2 విజయనిర్మలకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అనంతరం శరత్ మాట్లాడుతూ దేవనకొండ మండలంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలకు అడ్డులేకుండా ఉందని అన్నారు.ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా, యజమాన్యాలే స్వయంగా ఫీజులను నిర్ణయించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పీల్చే జలగళ్ల గా వేధించి,ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రంగు రంగుల కరపత్రాలతో విద్యార్థులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షింపజేసి, మొదట ఒక ఫీజు చెప్పి,పాఠశాలలో చేరాక ఇంకొక ఫీజు వసూళ్లు చేస్తున్నారని అన్నారు.అంతేకాకుండా ఎలాంటి కనీస అర్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకొని, విద్యా బోధన చేస్తున్నారని అన్నారు.మండలంలోని పాఠశాలలకు ఆట స్థలాలు లేవని,కనీస మౌళిక సదుపాయాలు కరువయ్యాయని అన్నారు.కరపత్రాలల్లో కంప్యూటర్ క్లాసులు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అని ముద్రించి,పాఠశాలల్లో కనీసం కంప్యూటర్ లు కూడా లేవని అన్నారు. అదే విధంగా మండలంలో తెర్నెకల్,పి.కోటకొండ, బి.సెంటర్, ఎం.కె.కొట్టాల,దేవనకొండ గ్రామాల్లో విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలు వెలిశాయని,వాటిని తనిఖీలు చేయడంలో మండల విద్యాశాఖాధికారులు విఫలమయ్యారని విమర్శించారు. మామూళ్ల మత్తులో మునిగి,కార్యాలయాల్లో కుర్చీలకే పరిమితమయ్యారని ఆరోపించారు.కావున ఇప్పటికైనా మండల విద్యాశాఖాధికారులు నిద్రావస్థ నుంచి మేల్కొని, మండల వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించి,ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న యజమాన్యాలపై చర్యలు తీసుకొని, పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో విద్యార్థులను సమీకరించి డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి భాస్కర్,నాయకులు ఈశ్వర్, భరత్,సురేంద్ర,వినోద్ తదితరులు ఉన్నారు.