ANDHRA PRADESHCRIME NEWS
బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి

బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
వెల్దుర్తి జూన్ 16 యువతరం న్యూస్:
బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సిఐ రమేష్, వెల్దుర్తి ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అన్నారు. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి పండుగ నిర్వహించుకోవాలని సందర్భంగా వారు సూచించారు.