సాగు పంటలపై రైతులకు అవగాహన సదస్సు

సాగు పంటలపై అవగాహన సదస్సు
అమడగూరు జూన్ 15 యువతరం న్యూస్:
అమడగూరు మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ గ్రామ రైతుభరోసా కేంద్రంలో శుక్రవారం వివిధ సాగు పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో డిఆర్సీ,ఏడిఏ సన్నావుల్లా ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు సూచనలు సలహాలిచ్చారు. ప్రధాన పంటలైన వేరుశెనగ,సజ్జ,కంది, మొక్కజొన్న తదితర పంటలకు విత్తన శుద్ధి చేయడంతో నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళను నివారించవచ్చని అలాగే వివిధ పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్ళు,పురుగులను ఏవిధంగా నివారించాలో,సస్యరక్షణ చర్యలు, నీటి యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై ఆయన ఈసందర్భంగా వివరించారు.నాన్ యూరియా,డిఏపి వలన పంటలకు కలిగే ఉపయోగాల గురించి వివరించారు. డ్రోన్ ద్వారా పురుగులు,తెగుళ్ళ మందు పిచికారి చేయడం వలన సాగు ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమణాచారి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కృష్ణమూర్తి, రాజారెడ్డి,నాగేంద్ర కుమార్ రెడ్డి, సిద్ధప్ప,కమ్మల భాస్కర్,డా”రవికుమార్,ఈశ్వర్ రెడ్డి,దినేష్ రెడ్డి,నారాయణస్వామి, అబ్దుల్ రవూఫ్,అక్బర్ భాష,రమేష్,రమణారెడ్డి,రెడ్డప్ప,టి.మధుసుధన్,ప్రసాద్,శ్రీనివాసులు,అంజనప్ప,జె.శ్రీనివాసులు,భైరిశెట్టి,ప్రజాప్రతినిధులు,రైతుభరోసా సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.