పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తా
పార్టీ విజయానికి పనిచేసిన ప్రతి కార్యకర్త ను గుర్తు పెట్టుకుంటా.
ప్రజా సేవకురాలిగానే సేవచేస్తా.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నా కర్తవ్యం
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువ
అమడగూరు జూన్ 14(యువతరం న్యూస్)
పుట్టపర్తి నియోజకవర్గం
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని వారికి అన్ని విధాలుగా అండగా అండగా నిలుస్తానని తెలిపారు. పుట్టపర్తి ఎమ్మెల్యే గానే కాకుండా ఒక ప్రజాసేవకురాలిగా ప్రజలకు మరింత దగ్గరగా అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె వెల్లడించారు .ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే నా కర్తవ్యం అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా పల్లె సింధూర రెడ్డికి శుక్రవారం పలువురు నాయకులు, కార్యకర్తలు ,ప్రభుత్వ ఉద్యోగులు , ఇతర వర్గాల వారు భారీ సంఖ్యలో తరలి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు . అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టిడిపి ,జనసేన, బిజెపి కార్యకర్తలు ,నియోజకవర్గ ప్రజలు అనంతపురం లోని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలపడానికి తరలివచ్చారు . ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆయన తనయుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డికి ప్రత్యేకంగా పుష్పగుచ్చాలు, స్వీట్స్ ,మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టపర్తి నియోజకవర్గం తోపాటు అనంతపురం లో ఉన్న పల్లె అభిమానులు ,మరియు పివికేకే కళాశాల, సప్తగిరి,,బాలాజీ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, కలశాల ఉద్యోగులు, సిబ్బంది తోపాటు పలువురు ప్రభుత్వఅధికారులు ,ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు తదితరులు విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం, నల్లమాడ ,అమడగూరు ,ఓడి చెరువు ,కొత్త చెరువు, పుట్టపర్తి మండలాల నుంచి టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితర రంగాల వారు హాజరై నూతన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పల్లే కృష్ణ కిషోర్ రెడ్డి కి పుష్ప గుచ్చాలు అందించి శాలువతో సన్మానించారు.