ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు సఫలం

.ప్లాష్,ప్లాష్.చర్చలు.వివరాలు…
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ…..

(యువతరం జనవరి 23) విజయవాడ ప్రతినిధి:

డిసెంబర్ 12 నుండి (42 రోజులు)అలుపెరగకుండా నిరవధికంగా సమ్మెలో కంటేపాల్గొన్న అంగన్వాడి అక్క, చెల్లెలు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సమ్మెను విరమించి ఈరోజు నుండి యధావిధిగా ఉదయం 9. గంటలకి విధుల్లోకి చేరాలని కోరుతున్నాము..

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి.
రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి , ఐసిడిఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయలక్ష్మి  ,కమిషనర్ జానకి గారు ,ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రావత్  తో మూడు యూనియన్ల ప్రతినిధులతో చర్చలు జరిగాయి. చర్చలు సానుకూలంగా జరిగాయి .మనం ఇచ్చిన ఎక్కువ డిమాండ్స్ అంగీకరించినందుకు సమ్మెను విరమించాలని నిర్ణయించడం జరిగింది.. మనతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేసిన మంత్రులకు ప్రభుత్వ అధికారులకు, పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సమ్మెలో పాల్గొని మద్దతు తెలియజేసిన మనతోటి లబ్ధిదారులకు,, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ,మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు .అన్నిటికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం..
చర్చలలోఅంగీకరించిన అంశాలు.

1.జూలై లో జీతాలు పెంచుతాం ….యూనియన్లకు ప్రభుత్వానికి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన అమౌంటు ని పెంచుతాము అని రాతపూర్వకంగా మినిట్స్ కాపీ ఇస్తామని అంగీకరించారు.
వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం

2. గ్రాడ్యుటీకి సంబంధించి కేంద్రానికి లెటర్ రాస్తామని తెలియజేశారు.
ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని
వర్కర్లకు 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాలని
హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం చారు
3. మినీ వర్గాలని మెయిన్ వర్కర్లుగా మార్పు చేస్తూ జీవో ఇస్తామని అంగీకరించారు అయితే కొంత సర్వే చేసి వివరాలు తీసుకొని వీలైనంత త్వరలో జీవో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
4. సర్వీస్ లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం ఇవ్వటానికి ప్రయారిటీ ఇస్తామన్నారు. చనిపోయిన వారికి అంగన్వాడీ బీమా లేదా వైయస్సార్ భీమా అమలు చేస్తామని అంగీకరించారు. ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పారు.మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

5. హెల్పర్ల ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకే పెంచాలని నిర్ణయించారు .ప్రమోషన్లకి నిర్దిష్టమైన నిబంధనలు రూపొందిస్తామని అంగీకరించారు
6.సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం
సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం
7.ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచారు.
8. పరీక్ష రాసిపెండింగ్ లో ఉన్న 164 గ్రేట్ టు సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని కోరా ఏప్రిల్ నాటికి ఇస్తామని హామీ ఇచ్చారు.
9. నాలుగు యాప్లు కావాలి ఒక యాప్ గా మార్చాలని కూడా నిబంధనలు రూపొందిస్తామన్నారు.
10. వేదనంతో కూడిన మెడికల్ లేవు,వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు, మెనూ పెంపు, గ్యాస్ ,తదితర సమస్యలు కమిటీ వేసి చర్చించి ఫైనల్ చేస్తామని అంగీకరించారు.
11. మే నెల అంతావేసవి సెలవులు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించదు .ఈపాటికి మనం ఫైల్ రెడీ చేసి పంపిస్తే రిజెక్ట్ చేసిందని తెలియజేశారు..
12.అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు అని మంత్రుల బృందం తెలియజేసింది అంగీకరించిన అన్ని అంశాలు కూడా మూడు రోజుల్లోమినిట్స్ కాపీని అందిస్తామని తెలియజేశారు. అందువలన అందరూ వెంటనే సమ్మెను విరమించి యధావిధిగా విధుల్లోకి చేరాలని కోరారు..

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!