ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీశైలం క్షేత్రం నందు నేడు గరికపాటి ప్రవచనం

శ్రీశైల క్షేత్రం నందు నేడు గరికపాటి ప్రవచనం
(యువతరం నవంబర్ 30) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలక్షేత్రం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం మహా సహస్ర అవధాని డా. గరికపాటి నరసింహారావు చే ‘శ్రీ భ్రమరాంబికాఆ ష్టకం’ పై ప్రవచనా కార్యక్రమాన్ని నేడు ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడ వీధిలోని ధర్మ పదం( నిత్య కళారాధన) వేదిక వద్ద సాయంకాలం 7 గంటల నుంచి ఈ ప్రవచనా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాగా ఈ ప్రవచనా కార్యక్రమంలో ప్రవాచకుల వారు శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారి అష్టకంలోని విశేషాలు మొదలైన అంశాలను వివరించనున్నారు. సందర్భానుసారంగా వీరు శ్రీ శైల క్షేత్ర దివ్య మహిమ విశేషాలను కూడా వివరించనున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రవచనాలను విని తరించవలసినదిగా తెలియజేయడమైనది.