శ్రీశైలం క్షేత్రం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజ పుష్పార్చన

శ్రీశైల క్షేత్రం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజ పుష్పార్చన
(యువతరం నవంబర్ 30) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజను నిర్వహించారు. శ్రీశైల క్షేత్రం నందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. క్షేత్రంలోని ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద నేలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రతి గురువారం ఈ విశేష పూజను జరుపబడుతుంది. తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాభిషేకము విశేష పూజలు నిర్వహిస్తారు. లోకద్ధరణ కోసమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే స్వరూపంలో శ్రీ దత్తాత్రేయునిగా అవతరించారు అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా శ్రీ మహాగణపతి పూజను నిర్వహిస్తారు. శ్రీశైల క్షేత్రానికి శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది . ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు తపస్సు చేశారని ప్రతిదీ. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు. దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో గోదావరి తీరాన పిఠాపురంలోని శ్రీపాద వల్లభునిగా జన్మించారు. శ్రీపాద వల్లప్పుడు తమ శిష్యులకు ఆయా తీర్థ క్షేత్రాల మహిమ విశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైల క్షేత్రాన్ని పలుసార్లు ప్రస్తావించారు. వీరు ఒకసారి శ్రీశైలం క్షేత్రంలోని చతుర్మానియా వ్రతాన్ని ఆచరించినట్లు గురు చరిత్రలో చెప్పబడింది. శ్రీపాద వల్లభులు జన్మ తర్వాత మహారాష్ట్రలోని కరంజీ నగరంలో నృసింహ సరస్వతి స్వామిగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు జన్మించారు. వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జున ని స్వామిని సేవించినట్లు కూడా గురు చరిత్ర చెప్పబడుతుంది. నరసింహ సరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళ గంగ లోనే చేశారు. కలియు ప్రభావం రోజురోజు కు ఎక్కువ కావడంతో నరసింహ సరస్వతి స్వామి వారి అదృశ్య రూపంలో ఉండి తమ భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతిక దేహాన్ని సృజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైల క్షేత్రానికి వచ్చారు. శ్రీశైల క్షేత్రంలోని కదలి వనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసిమ సరస్వతి స్వామి వారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనం పై కూర్చుని కృష్ణా నదిలోకి ప్రవేశించి కొంత దూరం ఆరిటాకులపైనే పయనిస్తూ అదృశ్యమైనట్లుగా గురు చరిత్ర చెప్పబడుతుంది.