శ్రీశైలం క్షేత్రం నందు కార్తీక మాస సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల క్షేత్రం నందు కార్తీక మాస సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు
(యువతరం నవంబర్ 30) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు కార్తీక మాసం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా పలు ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాగా ఈ కార్యక్రమాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైల దేవస్థానం మరియు జాతీయ సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ దక్షిణ ప్రాంతీయ కేంద్రం, బెంగళూరు వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించబడుతున్నాయి. మరి కొన్ని కార్యక్రమాలు దేవస్థానం తరఫున ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రఖ్యాత నాట్య కళాకారిణి అవని, శ్రీలత, అభినయ కూచిపూడి కళాక్షేత్రం హైదరాబాద్ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో పావని, శ్రీలత, ప్రసాద్, హరిత, అన్విత ,అభినయ ప్రవళిక కీర్తన తదితరులు నృత్య ప్రదర్శన చేయనున్నారు. అనంతరం దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ కళా నర్తక కూచిపూడి డాన్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో గణపతి కౌత్యం, మూషిక వాహన, నమశ్శివాయతే, శివాష్టకం తదితర గీతాలకు అష్టకాలకు కీర్తి, లిఖిత, భవ్య ,జ్యోతిక, గాయత్రి తదితరులు నృత్య ప్రదర్శన చేయనున్నారు.