శ్రీశైలం క్షేత్రం నందు ఉచిత సామూహిక సేవలు

శ్రీశైలం క్షేత్రం నందు ఉచిత సామూహిక (శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ ఉత్సవం) సేవలు
(యువతరం నవంబర్ 30) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు ధర్మ ప్రచారంలో భాగంగా దేవస్థానం వారు ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత సామూహిక సేవలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవలో భాగంగా చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ్ ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కాగా ఈ ఉచిత సేవకై ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తుల చేత సామూహిక కల్యాణోత్సవాన్ని జరిపించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యాపక యం. పూర్ణానందం, అర్చక స్వాములు సహాయ కార్యనిర్వహణ అధికారి ఎం హరిదాసు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సామూహిక కళ్యాణోత్సవంలో ముందుగా భక్తులందరి గోత్రనామాలతో సంకల్పం జరిపించబడింది. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని శ్రీ మహాగణపతి పూజను జరిపించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించబడింది స్వామి వారి దర్శనం అంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సేవాకర్తలకు రెండు లడ్డు ప్రసాదాలు కైలాస కంకణాలు అందజేయబడ్డాయి. దర్శనాంతరం భక్తులందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనం నందు భోజన సదుపాయం కూడా కల్పించబడింది. సామూహిక కల్యాణోత్సవంలో స్థానికులే కాకుండా మార్కాపురం చిత్తూరు గుంటూరు తదితర ప్రాంతాల చెందిన వారు కూడా పాల్గొన్నారు.