శ్రీశైలంలో లలితాంబికా కాంప్లెక్స్ లో షాపుల నిర్మాణాలను అడ్డుకున్న దుకాణదారులు

శ్రీశైలంలో లలితాంబిక కాంప్లెక్స్లోj,K,L బ్లాక్ ల మధ్యలో నూతనంగా షాపులు నిర్మించడానికి చర్యలు చేపట్టిన దేవస్థానం అధికారులు- అడ్డుకున్న దుకాణదారు లు.
(యువతరం నవంబర్ 2) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు లితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లోJ,K,L బ్లాక్ ల మధ్య నూతనంగా షాపుల నిర్మాణానికి అడ్డుకున్న దుకాణదారులు. ఇరుకు సందులతో కూడిన కాంప్లెక్స్ ని మరింత ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం. రెండు నెలల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైర్ ఇంజన్ లోపలికి రాలేని పరిస్థితి, ఇదే సంఘటన A,B,C,D,E,F,G, బ్లాకులలో జరిగితే పరిస్థితి ఏంటి? దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగిన లేదా అగ్ని ప్రమాదం జరిగిన ఇరుకు సందుల కారణంగా ఎటు వెళ్లలేని పరిస్థితి భక్తులు మరియు దుకాణదారులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న మళ్లీ కొత్త షాపులను అగ్ని ప్రమాదం జరిగిన చోటనేJ,K,L బ్లాక్ ల ముందర భాగంలో ఇరికించడం దుకాణదారులు భావోద్యోగానికి గురి అవుతున్నారు. పచ్చదనంతో కూడిన భారీ వృక్షాలను భక్తులకు మరియు దుకాణదారులకు ఉపయోగపడే మరుగుదొడ్లను తొలగించారు.