పత్తికొండలో 18వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

పత్తికొండలో 18వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
(యువతరం సెప్టెంబర్ 30) పత్తికొండ ప్రతినిధి:
పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో 18 వ రోజు శనివారం పత్తికొండలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ బాబు గారికి తోడుగా ఒక్క నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలో 18 వరోజు కర్నూల్ రోడ్డు నందు ఉన్న అంభేథ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మీరు రచించిన రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నారు అని వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.అనంతరం అక్కడ నుండి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వచ్చి మహాత్మా గాంధీ , పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి రిలే నిరాహారదీక్షలో గిరిజన మహిళలు (లంబాడీ)రీలే నిరాహారదీక్ష లో కూర్చున్నారు. శిబిరం వద్ద దీక్షలు చేపడుతున్న వారికీ పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సొమ్ల నాయక్, రవీంద్రా నాయక్, చక్రీ నాయక్, క్రిష్ణ నాయక్, శీను నాయక్, నాగన్న నాయక్,వెంకటప్ప నాయక్ లు పాల్గొన్నారు.దీక్షలో సరోజ బాయి,లక్ష్మి బాయి,సాలమ్మ బాయి,బాలమ్మ బాయి,లక్ష్మి బాయి,మంగమ్మ బాయి,కమలమ్మ బాయి,లక్ష్మి బాయి,వెంకటమ్మ బాయి,సరోజ బాయి,లక్ష్మి బాయి,అనుమక్క బాయి,రమణమ్మ బాయిలు కూర్చున్నారు.