అందరికీ సంపూర్ణ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ధ్యేయం
ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

అందరికీ సంపూర్ణ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ధ్యేయం
ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
(యువతరం సెప్టెంబర్ 30) తుగ్గలి విలేఖరి:
గ్రామీణ ప్రాంతాలలోనే ప్రజల అందరికీ సంపూర్ణ వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని గ్రామస్థాయిలో ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. శనివారం మండలంలోని బొందిమడుగుల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుగ్గలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కి స్వాగతం పలికారు. అనంతరం కర్నూల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణులు ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే అనారోగ్యానికి గురైన ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోనే అన్ని కార్పొరేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందివ్వడంతో పాటు, ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం నిధి కింద అనారోగ్యానికి గురైన వారికి ఆర్థిక సాయం అందించడం కూడా జరిగిందన్నారు.అలాగే గ్రామాలలో విద్య, వైద్యంతో పాటు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం నియోజవర్గంలోనే పలు చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లు మళ్లించడం జరిగిందన్నారు. దీంతో ఈ ప్రాంతంలో త్రాగునీటి సాగినీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆమె అన్నారు. అందువల్ల రానున్న ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ను ఎన్నుకునేందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవి, డిప్యూటీ తాసిల్దార్ నిజాముద్దీన్, ఎంపీడీవో సావిత్రి, వైద్య అధికారులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ హరిత, సి హెచ్ ఓ అన్నపూర్ణ ,పి హెచ్ ఎన్, సరస్వతి, సూపర్వైజర్లు నాగమ్మ, వెంకటరమణయ్య, ఈరన్న, ఆప్తలిక్ అసిస్టెంట్ హనుమంతు రెడ్డి మరియు తుగ్గలి మండలం వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.