
బెంగళూరులో 144 సెక్షన్ – నగర పోలీస్ కమిషనర్ దయానంద్..
(యువతరం సెప్టెంబర్ 26) బెంగళూరు:
బెంగళూరు బంద్‌కు అవకాశం లేదని, సోమవారం అర్ధరాత్రి నుంచే నగర వ్యాప్తంగా 144వ సెక్షన్(144 Sec) జారీ చేశామని నగర పోలీస్ కమిషనర్ దయానంద్(City Police Commissioner Dayanand) స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి బంద్‌లకు అవకాశం ఇవ్వరాదన్నారు. సోమవారం కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ నిరసన కొనసాగించినా ప్రజల ఆస్తులకు నష్టం, ప్రజా జీవనానికి భంగం ఉండరాదన్నారు. నిరసన వేళ హింసాత్మాక సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాలను పెంచామన్నారు. బలవంతంగా బంద్ చేయించేందుకు వీలు లేదన్నారు. నగరవ్యాప్తంగా 60 కేఎ్‌సఆర్‌పీ, 40 సీఏఆర్ ప్లటూన్‌లతోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు..