ANDHRA PRADESHPOLITICSSOCIAL SERVICE
సైకిల్ పై అటల్ ప్రజాసంకల్పయాత్ర

సైకిల్ పై అటల్ ప్రజాసంకల్పయాత్ర…
(యువతరం సెప్టెంబర్ 26) మంగళగిరి ప్రతినిధి:
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, అవినీతి నిరోధక బిల్లు చట్టసభల్లో ప్రవేశపెట్టాలని తదితర డిమాండ్లపై మంగళగిరి అంబేద్కర్ సెంటర్ నుండి అసెంబ్లీ వరకు స్థానిక అఖిల భారత అటల్ జనసభ అధ్యక్షులు మైలా శ్రీనివాసరావు సోమవారం సైకిల్ పై అటల్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు.