ANDHRA PRADESHOFFICIAL
లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం
(యువతరం సెప్టెంబర్ 25) తెనాలి ప్రతినిధి:
స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి వారు విజయవాడ లోని ప్రఖ్యాత మేక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాలవారిచే ఉచిత కంటివైద్య శిబిరం నందులపేటలోని హరిత ఇంగ్లీషు మీడియం స్కూల్ నందు సోమవారం నిర్వహించారు. ఈ శిబిరంలో మేక్సివిజన్ సూపర్ స్పెషాలటీ వారు తెచ్చిన వివిథ పరికరములతో వివిథ రకములైన కంటి పరీక్షలను నిర్వహిచినారు.
సుమారు 200మందికి వివిథ రకాలైన కంటిపరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యకక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి అద్యక్షులు లయన్ యక్కల రామ్మోహన్ రావు సెక్రటరీ లయన్ ఉదయ్ శంకర్, ట్రజరర్ లయన్ ఆత్మూరి వేంకటేశ్వరరావు పాఠశాల కర స్పాండెంటు లయన్ కన్నెగంటి వేంకట కిషోర్ సిబ్బంది పాల్గొన్నారు.