చెత్త రహిత తెనాలికి ఎన్ సి సి సభ్యుల సహకారం

చెత్త రహిత తెనాలికి NCC సభ్యుల సాకారం
(యువతరం సెప్టెంబర్ 25) తెనాలి ప్రతినిధి:
తెనాలిని “స్వచ్చతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా “గార్బేజ్ ప్రీ సిటీ ” అనే నినాదంతో సోమవారం రోజు తెనాలి పట్టణంలోని 22 ఆంధ్ర బెటాలియన్ NCC విద్యార్థినీ విద్యార్థులు 350 మందితో స్వచ్చత పక్వాడా ర్యాలీ నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని,సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని,దోమల పెరుగుదలను అరికట్టాలని,పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్లే కార్డులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.
పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన NCC స్టూడెంట్స్,ఆంధ్ర బెటాలియన్ ఆఫీసర్స్,మునిసిపల్ ఉద్యోగులు కలిసి గాంధీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 22 ఆంధ్ర బెటాలియన్ NCC ఆఫీసర్స్ సుబేదార్ క్రిషన్ జ్యోతి, సుబేదార్ అవతార్ సింగ్, సుబే దార్ సేవాదేవ్, సుబేదార్ జ్యోతి సింగ్,అలుసోసియేట్ NCC ఆఫీసర్లు సర్దార్ పరిస, కె.స్వామి, శానిటరి ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, శానిటేషన్ సెక్రెటరీలు యన్. ప్రవీణ్ కుమార్, డి. సాగరయ్య, కె.సంధ్య, జె.హవెలా ప్రియదర్శిని లు పాల్గొన్నారు.