టిడిపికి మరో బ్లాస్టింగ్ షాక్…… ఒకేసారి 5 మంది నేతల మూకుమ్మడి రాజీనామా……?????

టీడీపీ మరో బ్లాస్టింగ్ షాక్.. ఒకేసారి 5 మంది నేతల మూకుమ్మడి రాజీనామా..!
(యువతరం సెప్టెంబర్ 8) ఆలూరు /దేవనకొండ విలేఖరి:
దేవనకొండ మండల కేంద్రంలో టీడీపీ లో చెలరేగిన ముసలం మండల నేతలకి తలనొప్పిగా మారింది.అంతర్గత పోరు తెలుగుదేశం నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గతంలో పలుమార్లు టీడీపీలోని వర్గాల మధ్య ఉన్న విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి బట్టబయలయ్యాయి. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వర్గపోరు తాజాగా రాజీనామాల వరకు వెళ్లింది ఉప సర్పంచ్ రాజీనామా వార్డు నెంబర్లకి తెలియకుండా ఉపసర్పంచ్ రాజీనామా జరిగిందని వార్డు సభ్యులు వాపోయారు. వివరాల్లోకి వెళితే స్థానిక మేజర్ పంచాయతీ ఎలక్షన్లో 8 మంది టీడీపీ వార్డు నెంబర్లు గెలుపొందారు. 6 మంది వైసీపీ వార్డు నెంబర్లు గెలుపొందారు. .అప్పుడు మండల టిడిపి నేతలు ఎర్రగోటి నరసన్నను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నరు .రెండున్నర సంవత్సరాలు వేరొకరు ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు రెండున్నర సంవత్సరం పూర్తి అయినందున ఇప్పుడు ఉన్న ఉపసర్పంచిని రాజీనామా చేయించారు. కానీ వార్డు మెంబర్లు ప్రమేయం లేకుండా చెయ్యడం తలనొప్పిగా మారాయి ఉపసర్పంచ్ ని సర్పంచ్ దగ్గర ఉండి రాజీనామా చేయించారని విశ్వసనీయ సమాచారం .ఈ తరుణంలో టీడీపి గ్రామ ఉపసర్పంచ్ నియామకం కాకరేపింది. పార్టీలో పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గ్రామ వార్డు సభ్యులు కుక్కల కాసిం, టపాల రామాంజనేయులు, గిత్త నరసన్న,నరసన్న ,మీనాక్షి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు గాని గ్రామా పంచాయితి కార్యక్రమాలు మమ్మల్ని పట్టించుకునే పాపాన లేదని పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేసి పంచాయితీలో అభివృద్ధి పనులు చేయడానికి సభ్యులకు అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. అందుకుగాను రాజీనామా యోజన లో ఉన్నట్లు సమాచారం ఎంపీడీవో కి వినతి పత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు. వార్డు నెంబర్లు రాజీనామా అసంతృప్తి అలజడి రేపింది. దీంతో మూకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వార్డు సభ్యులు సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఐదు మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఆలూరు టిడిపి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మను కలిసి వాస్తవాలను వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అప్పగించిన ఉప సర్పంచ్ పదవులన్నీ రద్దు చేయాలని అన్నారు. రద్దు చేయకపోతే మాత్రం మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాలపై పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.