WORLD

జకార్తా టూర్ లో ప్రధాని మోడీ

జకార్తా టూర్‌లో ప్రధాని మోదీ

(యుయువతరం సెప్టెంబర్ 7) న్యూఢిల్లీ

రెండ్రోజుల్లో ఇండియాలో జీ-20 సదస్సు ఉన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన షెడ్యూల్‌ని అత్యంత బిజీగా ఉంచుకుంటూ.. ఇవాళ ఇవాళ ఇండొనేసియాలోని జకార్తాలో పర్యటిస్తున్నారు..

అక్కడ ఇవాళ జరిగే 20వ ఆసియన్ (ASEAN)- ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఇండియా అమలుచేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ గ్రూప్.. మూల స్తంభం లాంటిది అని మోదీ అన్నారు.

ఇండో-పసిఫిక్ దేశాలపై ఆసియన్ గ్రూప్ అవుట్‌లుక్‌ని పూర్తిగా భారత్ సమర్థిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. “మన భాగస్వామ్యం 4వ దశాబ్దంలోకి ప్రవేశించింది. ఇండియా యొక్క ఇండో-పసిఫిక్ ఇన్షియేటివ్‌లో ఆసియన్ కీలక పాత్ర పోషిస్తోంది” అని మోదీ తెలిపారు.

ఆసియన్ గ్రూపు.. అభివృద్ధికి కీలక కేంద్రంగా ఉందనీ, ప్రపంచ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. “మన పరస్పర సహకారంలో స్థిరమైన వృద్ధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా మనం కలిసి సాగుతున్నాం” అని మోదీ అన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!