ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
పునః ప్రారంభమైన రాయలసీమ జోన్ ఎస్ఐ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు

పునః ప్రారంభమైన రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్ధుల దేహదారుఢ్య పరీక్షలు
రెండు రోజుల వర్షం కారణంగా నిలిచి మళ్లీ ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు
(యువతరం సెప్టెంబర్ 7) కర్నూలు ప్రతినిధి:
పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో దేహదారుడ్య పరీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి కే 600 మంది అభ్యర్దులు హాజరయ్యారు.
దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ , జిల్లా ఎస్పీ జి . కృష్ణ కాంత్ , సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ పర్యవేక్షిస్తున్నారు.