ANDHRA PRADESHPOLITICS
ఎమ్మెల్యే శ్రీదేవి చేతుల మీదుగా మద్దికేర జగనన్న కాలనీలో రూ. 50 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మెల్యే శ్రీదేవి చేతుల మీదుగా మద్దికేర జగనన్న కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ
(యువతరం సెప్టెంబర్ 6) మద్దికేర విలేఖరి
మండల కేంద్రమైన మద్దికేరలో జగనన్న కాలనీలో నీటి సౌకర్యం కొరకు రూ. 50లక్షల జల జీవన్ నిధులతో నూతనంగా నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మద్దికేర పట్టణ నాయకుల తో కలసి భూమి పూజలో పాల్గొన్నారు.అలాగే ఎన్నో ఏళ్లుగా పట్టాలకు నోచుకొని గుంతకల్ రహదారిలో ఉన్న జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.