
నియోజకవర్గ ప్రజలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
ఆర్కె
(యువతరం సెప్టెంబర్ 6) మంగళగిరి ప్రతినిధి
అలౌకిక ఆనందానికి, వ్యక్తిత్వ వికాసానికి శ్రీ కృష్ణుడు ప్రతిరూపమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(RK) పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత ప్రభోధకుడిగా, రాజనీతిజ్ఞుడిగా కృష్ణుడి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు శ్రీకృష్ణ తత్వం ప్రతీక అన్నారు.శ్రీ కృష్ణ తత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.