ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వేధింపులను అరికట్టాలి

ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వేధింపులను అరికట్టాలి
వాహన మిత్ర పేరుతో జగనన్న ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తే సహించం: సిఐటియు..
(యువతరం సెప్టెంబర్2) ఎమ్మిగనూరు ప్రతినిధి :
దేశంలో రాష్ట్రంలో కీలక రంగమైన రవాణా రంగం లోని ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు ప్రజలకు ఎల్లవేళలా ఉపయోగపడుతారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, ఏపీ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు, సిఐటియు తాలూకా కార్యదర్శిబి రాముడు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఎద్దుల మార్కెట్ రోడ్డులో కనకవీడు ఆటో స్టాండ్ వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీలక రంగమైన ట్రాన్స్పోర్ట్ రంగంపై బిజెపి ప్రభుత్వం జిఎస్టి జో నెంబర్ 27 పేరుతో తీసుకొచ్చిందన్నారు. అలాగే పోలీసులను అడ్డుపెట్టుకొని చలానా పేరుతో కోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఆటో కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వము, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కార్మికులంతా ఐక్యంగా ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గోవిందు లక్ష్మీ నరసయ్య ఆందోని రామన్న ఆటో యూనియన్ నాయకులు కృష్ణ ఈరన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎంపిక:
గౌరవాధ్యక్షులుగా బి రాజు, అధ్యక్షులుగా మోహన్ దాస్, ఉపాధ్యక్షులుగా రాజశేఖర్ లక్ష్మీకాంత, ప్రధాన కార్యదర్శిగా షబ్బీర్, సహాయ కార్యదర్శిగా దేవదాస్ ప్రభాకర్ కోశాధికారిగా రంగప్ప మరో 11 మందితో నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది.