వైయస్సార్ వర్ధంతిలో బయటపడ్డ విభేదాలు

వై ఎస్సార్ వర్ధంతిలో బయట పడ్డ విభేదాలు…
(యువతరం సెప్టెంబర్2) ఎమ్మిగనూరు ప్రతినిధి:
ఎమ్మిగనూరు పట్టణంలో
వైఎస్సార్ వర్థంతి వేడుకల్లో ఒక్కసారిగా వైసీపీ లో విబేధాలు బయటపడ్డాయి. ఏపీ లో ముందస్తు ఎన్నికల ప్రచార వేల ఎవరికీ వారు తమ బలాబలాలను చూపించడానికి సిద్దాం అయ్యారు.నేడు వైయస్సార్14 వ వర్ధంతి సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి,మరో పక్క రాష్ట్ర వీరశైవ లింగయత్ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రగౌడ్ విడి విడిగా తమ అనుచరులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వై ఎస్సార్ వర్ధంతి కార్యక్రమలు చేపట్టారు. వైస్సార్ విగ్రహం దగ్గర ఇద్దరు పోటా పోటీగా పాలాభిషేకం చేసి గజమాలలు వేశారు దింతో కార్యకర్తలు ఎటు వెళ్లలో తెలియకఅయోమయంలో
పడ్డారు.అయితే రుద్రగౌడ్ వెంట కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉండటం,ఎమ్మెల్యే తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంట తక్కువ గా కార్యకర్తలు ఉండటంతో ప్రస్తుతం
ఎమ్మిగనూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
రుద్ర గౌడ్ వెంట కార్యకర్తలు ఎక్కువ ఉన్నారని,జగన్మోహన్ రెడ్డి తో పాటు కార్యకర్తలు తగ్గువగాఉన్నారని .పట్టణంలో
గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి విభేదాలు చర్చనీయాంశంగా మారకుండా అధిష్టానం టికెట్ ఎవరికైనా కేటాయిస్తే కార్యకర్తలు ఒకే దాటి పై నిలపడే పరిస్థితి ఉంటుంది.లేదంటే కార్యకర్తలు చెల్లాచెదరు అయ్యే పరిస్థితి ఉంటుందని పట్టణం లో ప్రజలు చర్చించుకుంటున్నారు.