ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు పాలు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేస్తున్న జనసేన నాయకులు
(యువతరం సెప్టెంబర్ 02) కోసిగి విలేఖరి:
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జ్ లక్ష్మన్న ఆధ్వర్యంలో మండల అభిమాన నాయకులు రమేష్ , చందు , అంజి , వక్రాణి.వెంకటేష్ , సురేష్ ,శేఖర్ ,మధు ల అధ్యక్షతన జన్మదిన వేడుకలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకు పాలు , పండ్లు , బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా సీనియర్ అభిమాని గని బాలింతలకు ఒక బెడ్ ను విరాళంగా అందజేశారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ నజీర్ , నర్సింగ్ ఆఫీసర్స్ విద్యావతి ,రాఘవేంద్ర లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సేవకు మారుపేరని హీరోగా సినిమాల్లో నటిస్తూ కోట్లాది రూపాయలు ఎంతోమందికి సేవ చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసి రాష్ట్రవ్యాప్తంగా తమ సత్తా చాటుతామన్నారు. ప్రతి ఒక అభిమాని సైనికుడిలా పనిచేసి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. జనసేన పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చెందుతారన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కృష్ణ , ఈరన్న , రాము , నరసింహ , ప్రశాంత్ , రాకేష్ , నవీన్ , మధు , ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.