శ్రీ మార్కండేయ స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం

శ్రీ మార్కండేయ స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం
పూజలులందుకుంటున్న శ్రీ భక్త మార్కండేయ స్వామి వారు
(యువతరం సెప్టెంబరు 02) కోసిగి విలేకరి:
మండల కేంద్రం కోసిగిలో వెలిసిన పద్మశాలి కుల బంధువుల ఆరాధ్య దైవం శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ధర్మకర్త యంగళ ఆంజనేయులు అర్చకులు ఈరేష్ స్వామి ఆధ్వర్యంలో గంగా పూజ, నంది కోళ్లు పూజలు గావించారు. నది జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలు జరిపించి హారతులు ఇచ్చారు. నేడు ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, ఆకు పూజ వెండి కవచ అలంకరణ పల పుష్పాల సమర్పించి మహా మంగళ హారతులు గావించి విశేష పూజలు నిర్వహించనున్నారు. ఏటా సాంప్రదాయబద్ధంగా శ్రావణమాస మూడవ సోమవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంకాలం శివపార్వతుల విగ్రహాలను పురవీధులలో గుండా మేళతాళాలతో నిర్వహించనున్నారు. తద్వారా మండలంలోని పద్మశాలి కుల బాంధవులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, యంగలి ఆంజనేయ, గడ్డం శ్రీరాములు, శీను, మాణిక్య రాజు, గడ్డం ఈరన్న, వగ్గా చంద్ర కోరారు.