ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

జగన్ గద్దె దిగితేనే రాష్ట్ర అభివృద్ధి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

జగన్ గద్దె దిగితేనే రాష్ట్ర అభివృద్ధి

రాష్ట్రంలో పోలీస్ పాలన కొనసాగుతుంది

రిజర్వేషన్లు అమ్ముకుంటున్న జగన్ సర్కార్

బిజెపి, వైసిపి పాలనపై నిప్పులు చేరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

(యువతరం సెప్టెంబర్ 2 )పత్తికొండ ప్రతినిధి :

ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు గద్దె దిగితేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం నిర్వహించిన బస్సు యాత్రలో భాగంగా పత్తికొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ బడా కార్పొరేట్ సంస్థలైన ఆదానిలకు జగన్ సర్కారు కట్టబెడుతుందన్నారు. జగన్ పాలించిన నాలుగు ఏళ్లలో రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పురోగతి మాట అటు ఉంచితే బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు కూడా జగన్ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు అన్నారు. రిజర్వేషన్లను వ్యాపారంగా మరచి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్న గణత గతంలో ఎప్పుడూ లేదని ప్రస్తుతం జగన్ సర్కారు వాటిని పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలో పోలీసులు అడ్డం పెట్టుకొని వైసీపీ పాలన కొనసాగిస్తుందని పోలీస్ పహారాలో వైసిపి నాయకులు పాలన కొనసాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు పోలీసు అధికారులకు జగన్ తన జీవు నుండి జీతాలు చెల్లించడం లేదని పోలీసులు తీసుకుంటున్న జీతాలు ప్రజా ధనమే అని కావున పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వైసీపీ నాయకుల ఆదేశాలను పాటించి ప్రశ్నించిన వారికి 41 ఏ నోటీసులు జారీ చేయడం ఏమిటని ఆయన పోలీసుల తీరును. కావున రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ ,ఏ ఒక నాయకుడు శాశ్వతం కాదని పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలన్నారు. ఈమధ్య వైసీపీ నాయకులు చెబితే అనామకులపై ఎస్సీ ,ఎస్టీ కేసులు నమోదు చేసి వారితో డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తీరుపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావడం కాకుండా పోలీస్ వ్యవస్థ పై ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం ఏర్పడేలా కృషి చేయాలి అన్నారు. జగన్ పాలన ఇలా ఉంటే కేంద్రంలో మోడీ పాలన మరీ ఘోరంగా ఉందన్నారు. దేశంలో సంపద అంతటిని కేవలం కొంతమంది ఉన్నత వర్గాలకే దోచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కావున రానున్న కాలంలో ప్రజా వ్యతిరేక, అవినీతి, అక్రమాల ప్రభుత్వాలను కూకటివేలతో కుల దోయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, మండల కార్యదర్శి రాజా సాహెబ్, పెద్ద వీరన్న, కారుమంచి, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!