CRIME NEWSSTATE NEWS
మావోయిస్టు కరపత్రాలు బూటకం

మావోయిస్టు కరపత్రాలు బూటకం
ఎవరో కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
(యువతరం ఆగస్టు31) వాజేడు విలేఖరి:
వెంకటాపురం సర్కిల్ లోని జగన్నాధపురం వై జంక్షన్ వద్ద మావోయిస్టు కరపత్రాలు,పడ్డాయి అనే పేరు తోటి 29 /08/2023 రోజున నిజనిర్ధాన కు రాకుండా దినపత్రికలు ప్రసార మాధ్యమాల్లో వార్త హల్చల్ చేసిన సంఘటన ప్రజలకు విధితమే అయితే మావోయిస్టు కరపత్రాలు పడ్డాయి అనే దానిలో ఎంత మాత్రము నిజం లేదు.అక్కడ ఎటువంటి కరపత్రాలు లభించలేదు ఎవరూ కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి పన్నిన కుట్రగా భావిస్తున్నాము ఎన్నికల దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలలో భయాలు కలిగించడం సరికాదు ఎవరైనా అటువంటి సమాచారం అందితే పోలీసు వారిని సంప్రదించిన తర్వాతనే ముందుకెళ్లాలని కోరనైనది.