అమరవీరుల స్ఫూర్తిని నేటి తరంలో నింపాలి

అమరవీరుల స్ఫూర్తిని నేటితరంలో నింపాలి
బలహీనులు లేకుండా చేయాలనే పెద్ద సంకల్పంతో పోరాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ని బలపరుద్దాం
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
(యువతరం ఆగస్టు 20) రాప్తాడు విలేఖరి:
దేశం కోసం బ్రిటీష్ వారి తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, మహాత్మాగాంధి, తిలక్, ప్రకాషం పంతులు తదితర 3లక్షల 60 వేలమందిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. శనివారం రాప్తాడు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ‘‘నామట్టి– నాదేశం, మట్టికి ప్రణామాలు–వీరులకు వందనాలు’’ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు మనం చేస్తున్న ఉద్యోగులు, స్వేచ్చా వాయువులు, అనుభవిస్తున్న అధికారం ఇవన్నీకూడా వారుపెట్టిన బిక్ష. నేటికీ బ్రిటిష్ వారి సంకెళ్లలో బతికుంటే బానిసలుగా ఉండేవారం. భరతమాత అని చెప్పుకోలేక, వందేమాతరం అనే చెప్పుకునే పరిస్థితి ఉండేదికాదు. భానిసత్వం నుంచి విముక్తి కల్గించి వీర మరణం పొందిన వీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించి అమరవీరులైనన వారి స్ఫూర్తిని నేటితరంలో నింపాలి. నిజాయితీగా బకుతుదాం, బలహీనుల పక్షాన నిలబడుదాం. రాష్ట్రంలో బలహీనులు లేకుండా చేయాలనే పెద్ద సంకల్పంతో పోరాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని బలపరుద్దాం. మన ప్రాంతపు మట్టిని, మన ప్రాంతపు ఆశలు, ఆశయాలను మట్టిరూపకంగా, గంగాజలం రూపకంగా రాష్ట్రానికి పంపుతున్నాం. అక్కడి నుంచి డిల్లీకి పంపి మేమంతా మేరాభారత్ మహాన్ అంటూ ఒకే జెండా కింద బతుకున్నామని చాటు చెపుదామని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డ్ మెంబర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.