బిఆర్ఎస్ పథకాల పేరుతో తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వులు

బిఆర్ఎస్ పథకాల పేరుతో తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వులు
- (యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏ నిమిషం ఎటువంటి పథకాలతో ప్రకటనలు చేస్తుందో అర్థం కాని విచిత్ర పరిస్థితి నెలకొందని ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అటకెక్కించే ప్రభుత్వం నెలకొన్నదని త్వరలో వచ్చే ఎలక్షన్లకు ముందు జనాలకు ఆశ చూపే విధంగా కేసీఆర్ ఎత్తుగడలు ఉన్నాయని పత్రికా మిత్రుల సమావేశంలో పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంటకో మాట పూటకో పథకం పెడుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే విధంగా ఉందని రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్కరి రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో చేయకపోగా రైతుబంధు అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా బ్యాంకులలో తీసుకున్న రుణం అప్పుగానే ఉంచి దళిత బంధువు అని మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చి ఆ తర్వాత బీసీ బందు ఇప్పుడు మైనారిటీ బందు అని బందుల మీద బంధు ప్రకటిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజల చేత ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారని, ధరణి అని మరో పథకాన్ని తీసుకువచ్చి పూర్తిస్థాయిలో సవరించకుండా ఒకరు భూమిని మరొకరికి ఎక్కించి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ధరణి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను వారు ఇష్టం వచ్చినట్లు అమ్మినారని 2014-2018 ఎన్నికలలో బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తానని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి కొత్త పాటలు పాడుతున్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు ముందే ఓటమిని పసిగట్టి ఎలాగైనా ప్రజలను నమ్మించే విధంగా అన్ని కులాలకు బంధు పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. అయ్యా కేసీఆర్ హుజురాబాద్ లో దళిత బంధు ఏమైంది….?మునుగోడు లో ఎస్టీ బందు ఏమైంది…? ఇప్పుడేమో బీసీల బంధు ముస్లిం బంధువు కులవృత్తుల బంధు అంటున్నారని దుయ్యబట్టారు. రానున్న కాలంలో ప్రజలు నిన్ను నీ ప్రభుత్వాన్ని నమ్మరు గాక నమ్మరని మీరు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి ఏమైనట్టు, అన్ని కులాల జాతులకు వారి చెవులలో పూలు పెడుతుంటివి కేసీఆర్ మీరు ఎన్ని మాయలు చేసినా ప్రజలు నమ్మరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కంకణ బద్ధులై ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొనుటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.