OFFICIALPOLITICSSTATE NEWSTELANGANA

నిరుపేదలకు భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్

నిరుపేదలకు భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్

అందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్

జిల్లాలోని మైనార్టీలకు లక్ష రూపాయల చొప్పున 100 శాతం
సబ్సిడీతో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు .

(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఉర్దూ గర్ లో తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ ద్వారా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముస్లింలకు వంద శాతం సబ్సిడీ కింద లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథి గా హాజరై జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్లు , జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తో కలిసి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది .
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని వర్గాల అభివృద్ధి కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది కులవృత్తులను ప్రోత్సహించడంతోపాటు మైనార్టీలకు ఆర్థికంగా 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది అన్నారు.సర్కార్ అందిస్తున్న సహాయంతో పేదల ఉపాధి ఎంతో మెరుగుపడుతుంది ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కోసం గ్రామాలు వదిలి పట్టణాల ప్రాంతాలకు వలస పోయే పేదలు తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ సొంత ఊర్లలోనే ఉపాధి పొందుతున్నారు.అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మైనార్టీలకు లక్షణంగా చేయూతనిస్తున్నారు , దేశంలో ఎక్కడా లేనివిధంగా 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్నమన్నారు.మైనార్టీలకు వెలుగునిచ్చే ఈ పథకం జిల్లా కేంద్రంలో ఐదు నియోజకవర్గాలకు సంబంధించి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినట్లే మైనారిటీలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం పంపిణీ చేస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖర రావు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ , మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి , స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!