ఆరోగ్యం కోసం దేశవాళీ వరి రకాలు సాగు చేస్తున్న యువరైతు

ఆరోగ్యం కోసం దేశవాలి వరి రకాలు సాగు చేస్తున్న యువ రైతు
– రైతును అభినందించిన ఏడిఏ తాతారావు
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బిసువారిగూడెం గ్రామం లో 5 ఎకరాలలో బెంగాలీ కూలీలతో వరి నాటు జరుగుతున్న సమయం లో సమాచారం తెలుసుకున్న మణుగూరు సహాయ వ్యవసాయ సంచాలకులు తాతా రావు నాటు వేస్తున్న పొలాన్ని మండల వ్యవసాయం అధికారి వెంకటేశ్వర్లు, విస్తరణ అధికారి కేశవరావు తో కలిసి సందర్శించారు ఈ సందర్భం గా ఏడిఏ తాతరావు మాట్లాడుతూ రోజు రోజుకు మానవ జాతిని పట్టి పీడస్తున్న రోగాల బారి నుండి మనల్ని మనం కాపుడుకోవడం కోసం తప్పని సరిగా దేశవాలి వరి రకాలు సాగు చేసి మనం ఆహరం గా తీసుకోవాలన్నారు. అప్పుడే మనం మంచి ఆరోగ్యంగా ఉంటామని, మన సమాజం ఆరోగ్యముగా ఉంటుందని ఆరోగ్య సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలన్నారు.మణుగూరు పట్టణానికి చెందిన కొండేటి సతీష్ పినపాక మండలం బిసువారిగూడెం లో ఈ దేశవాలి రకాల ను సాగు చేస్తున్నారు.ఈ సందర్బంగా యువ రైతు సతీష్ మాట్లాడుతూ దేశవాలి వరి రకాల పై మక్కువతో ఏలాంటి పురుగు మందులువాడకుండా ద్రవ జీవామృతం, గన జీవామృతం వాడుతు నేల తల్లి ఆరోగ్యమా కాపాడుకుంటున్నానన్నారు. గత రెండు సంవత్సరాలుగా క్రిమీ సంహారక మందులు వాడక పోవడం వల్ల వానపాములు మా నేల లో లు పెరిగాయన్నారు. ఈ సందర్భం గా యువ రైతు ను తాతారావు అభినందించారు .బెంగాలీ నాటు ప్రతేకత ఏమి అనగా వీరు నాటుతో పాటు కాలి బాటలు ఒకేసారి తీయడం వల్ల ప్రత్యేకంగా కాలిబాటలు తీయడానికి ఖర్చు ఉండదని రైతు సతీష్ తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.