సెకండ్ ఏఎన్ఎం లను వెంటనే పర్మినెంట్ చేయాలి

సెకండ్ ఏఎన్ఎం లను వెంటనే పర్మినెంట్ చేయాలి.
నాలుగవ రోజుకు చేరిన ఏఎన్ఎం లఆందోళన
మణుగూరులో దీక్షలు ప్రారంభించిన ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు.
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సెకండ్ ఏఎన్ఎం లను వెంటనే పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎంలు ఆగస్టు 16 నుండి ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే వీరిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పినపాక నియోజకవర్గం లో సెకండ్ ఏఎన్ఎంలో మణుగూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట దీక్షలు శనివారం ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మున్నా లక్ష్మీకుమారి లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్ లక్ష్మీనారాయణ, మున్నా లక్ష్మీకుమారి , జంగం మోహన్ రావు, వేల్పుల మల్లికార్జున్ లు మాట్లాడుతూ….. గత అనేక సంవత్సరాలుగా సెకండ్ ఏఎన్ఎం లను అన్ని పనులకు ఉపయోగించుకుంటూ పర్మనెంట్ చేయకుండా కావాలనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఇది సరైన విధానం కాదని వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని ,ఏళ్ల తరబడి కష్ట నష్టాలు ఓర్చి, చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వం ఇకనైనా గుర్తించి, వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత నాలుగు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న ప్రభుత్వంకు చీమకుట్టినట్టైనా లేదని , కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యం చేశారని అనేక రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం, వారిని మెచ్చుకున్న ప్రభుత్వం సంవత్సరాల తరబడి పని చేస్తున్న ఏఎన్ఎం లను మాత్రం ఎందుకు పర్మనెంట్ చేయరని వారు ప్రశ్నించారు.
ప్రభుత్వం వీరి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎంపీ జీతాలు మాత్రం లక్షల రూపాయల్లో పెంచుతున్నటువంటి ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తుందని వారు ప్రశ్నించారు.
ఈ దీక్ష కార్యక్రమంలో సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుగ్యాల సుధాకర్, ఏఐటీయూసీ మణుగూరు మండల కార్యదర్శి అక్కి నరసింహారావు ,జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సోందే కుటుంబరావు, రైతు సంఘం నాయకులు మంగి వీరయ్య ,సహాయ కార్యదర్శి ఎస్ వి నాయుడు,సెకండ్ ఏఎన్ఎంలు ఇందిరా, సుమలత ,సంధ్య ,ఈశ్వరరాణి, సుజాత ,శాంతకుమారి, పార్వతి, రాధా, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఏఎన్ మ్ లు దీక్షలో పాల్గొన్నారు.