STATE NEWSTELANGANATOURISM
కరక గూడెంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

కరకగూడెంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు.
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు శనివారం కరకగూడెం మండలంలోని రాళ్ళవాగు పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. పినపాక, కరకగూడెం మండలాల ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి సిరిశెట్టి కమలాకర్ ఆద్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు గుణగంటి సారయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ ల సమస్యలు పరిష్కారిచాలని, ఫోటో గ్రాఫర్స్ అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, అందరికీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పినపాక, కరకగూడెం మండలాల ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారు.