బీసీల జీవితాలలో వెలుగులు

బీసీల జీవితాలలో వెలుగులు
బీసీ బాంధవుడు సీఎం కేసీఆర్
ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ ,
ఈనెల 21వ తేదీన మణుగూరు మండలంలో బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకి చెక్కుల పంపిణీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు .
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో ఈనెల 21వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు పినపాక నియోజకవర్గం లోని 300 మంది బీసీ కులవృత్తులు చేస్తున్న లబ్ధిదారులకి పూర్తిస్థాయి సబ్సిడీతో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ..
బీసీ కులాస్తుల జీవితాలలో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నదని అన్నారు, కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వచ్చేలా బిఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదఅన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి సీఎం కేసీఆర్ అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు అన్నారు. వృత్తిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి సబ్సిడీతో లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సమైక్య పాలనలో బీసీల అభివృద్ధి వారి సంక్షేమం గురించి ఆలోచించ లేదన్నారు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో దళితులు బలహీన వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు తెలిపారు.బిసి కులవృత్తులను ఆదుకునేదెందుకు లక్ష రూపాయల చొప్పున పూర్తి సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ని బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతకి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కి ప్రజలు అండగా ఉండాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన సీఎం కేసీఆర్ అందులో భాగంగానే చేతివృత్తిదారులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.