
గడపగడపకు నేను వస్తున్నా నన్ను ఆదరించండి
గడల శ్రీనివాసరావు.
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్త కొత్తగూడెం నిర్మాణంలో భాగంగా సమస్యల అధ్యయనం కోసం పరిష్కార మార్గం అన్వేషణకై డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడప గడపకు గడల వస్తున్నా మీ ఇంటింటికి కొడుకులా అంటూ ప్రతి ఇంటి తలుపు తట్టనున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమవుతుంది.
విద్యా, వైద్యం, ఉపాధి,ఉజ్వల భవిష్యత్ కోసం…. అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రతిగడపకు వెళ్లి తన లక్ష్యాలు వివరించేందుకు డాక్టర్ గడల శ్రీనివాసరావు సన్నాహాలు ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రతి అమ్మను, అక్కను, చెల్లెమ్మను, నాన్నను, పలకరించేందుకు గడల రంగం సిద్ధం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 23 వ వార్డులో గడల స్వగృహం నుండి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ మిత్రులందరూ హాజరుకాగలరని సాదరంగా ఆహ్వనిస్తున్నాము.