పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు తప్పనిసరి చేయించుకోవాలి

పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు తప్పనిసరి చేయించుకోవాలి
(యువతరం ఆగస్టు 19) కొత్తపల్లి విలేఖరి
పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు తప్పనిసగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి మహేష్ అన్నారు. ఆయన శనివారం మండలంలోని నందికుంట గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని చేయించుకోవడం ద్వారా పంట నష్ట పరిహారం , పంట బీమా, సున్నా వడ్డీ పథకము లాంటివి వర్తిస్తాయన్నారు . అనంతరం ఆయన రైతులకు అధిక పురుగులు మందులు వాడటం వలన మానవ శరీరంపై పురుగుమందుల ప్రభావం విత్తన శుద్ధి వలన కలిగే లాభాలను వివరించారు. విత్తనం మొలక శాతం పరీక్ష మరియు బృంద విన్యాసంలో భాగంగా రైన్ క్లాప్స్ వంటి విన్యాసాలు రైతులతో చేయించారు. ఈ సంవత్సరం కరీఫ్ సీజన్ మొక్కజొన్న వేసుకున్న రైతాంగానికి బెట్ట పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడానికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ అధికారి శివకృష్ణ నాయక్ మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.