ANDHRA PRADESHOFFICIAL
తాడిపత్రిలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

తాడిపత్రి లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
(యువతరం ఆగస్టు 15) తాడిపత్రి ప్రతినిధి:
తాడిపత్రి పట్టణంలోని కిడ్స్ కేవ్ విద్యాసంస్థలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళ వారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో వందలాదిమంది బాలబాలికలు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో ప్రముఖుల చేత పిల్లలకు అర్థమయ్యేటట్టు కళ్ళ కట్టిన విధంగా దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత సోముల అనిత రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని వారి త్యాగపలంగానే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆరోజు దేశం కోసం ప్రాణాలు విడిచిన ఎంతోమంది దేశ నాయకులు వలెనే మనం ఈరోజు సంతోషంగా ఉన్నామని సోముల అనిత రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాలల్లో ఉన్న బాల, బాలికలు స్వాతంత్ర సమరయోధుల వేషధారణ ప్రజలను ఆకట్టుకుంది.