వివాదాస్పదం
వివాదాస్పదం
(యువతరం ఆగస్టు 15) వెల్దుర్తి విలేఖరి:
స్థానిక పోలీస్ స్టేషన్ లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది. సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమం వెల్దుర్తి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న వారు ఓకే జాతీయ పతాకానికి ఒక ప్రైవేటు వ్యక్తిని మధ్యన పెట్టుకొని మరోసారి జెండా వందనం ఎలా చేస్తారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది అందరూ కలిసి జండా వందనం చేయడం జరిగింది. ఆ తర్వాత అదే జెండాకు ఒక ప్రైవేటు వ్యక్తితో కలిసి మరోసారి వందనం చేయవచ్చా అన్న ప్రశ్నను మండల ప్రజలు లేవనెత్తుతున్నారు. ఒకవేళ అతను విఐపి అయితే సిబ్బంది మొత్తం ఉన్నప్పుడే పిలుచుకొని జెండా వందనం చేసి ఉండవచ్చు. అలాకాక ఒక ప్రైవేటు వ్యక్తి ఒక పక్కన ఉండి, విధి నిర్వహణలో ఉన్నవారు ఇరువురు ఒక పక్కన ఉండి జెండా వందనం చేయవచ్చు కదా అని ప్రజలు వర్షం కురిపిస్తున్నారు. ఇరువురు పోలీస్ సిబ్బంది మధ్య ఒక ప్రైవేటు వ్యక్తి ఉంటే అది కూడా జెండా వందనం అయిపోయిన తర్వాత మరలా జెండా వందనం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తి ఒక్కరే జాతీయ జెండాకు వందనం చేస్తే అది సబబుగా ఉంటుందని మండల ప్రజల పేర్కొంటున్నారు. సిబ్బందితో కలిసి జాతీయ జెండాకు వందనం చేసి మరొక్కసారి ప్రైవేటు వ్యక్తితో కలిసి జాతీయ జెండాకు వందనం చేయటం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది రెండవసారి జాతీయ జెండాకు వందనం చేయవలసి వస్తే విధి నిర్వహణలో ఉన్న వారు మాత్రమే చేయవచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విది నిర్వహణలో ఉన్నవారికి జాతీయ జెండాకు ఎప్పుడెప్పుడు వందనం చేయవచ్చన్న సంగతి కూడా తెలియదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఈ సంఘటన వెల్దుర్తి మండలంలో తీవ్ర చర్చనీయాంశముగా మారింది. ఈ సంఘటనపై లోతుగా విచారణ చేస్తామని ఎస్సై చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.