ANDHRA PRADESHSTATE NEWS
జూనియర్ సివిల్ జడ్జిగా బండి రచన

జూనియర్ సివిల్ జడ్జిగా – బండి రచన
(యువతరం ఆగస్టు 12) గుడివాడ ప్రతినిధి:
గుడివాడ చెందిన బండి రచన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె తల్లిదండ్రులు బండి శరత్‌బాబు, గీత న్యాయవాదులు. రచన విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో గత ఏడాదే న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేయగా దరఖాస్తు చేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణురాలై, ముఖాముఖిలోనూ విజయం సాధించి ఓపెన్ కేటగిరీలో పోస్టుకు ఎంపికయ్యారు. ఇంతకు మూడు నెలల కిందటే ఆమె హైకోర్టులో సెక్షన్ ఆఫీసరుగా ఎంపికై విధుల్లో చేరారు. ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికవడంతో ఆమె తల్లిదండ్రులు బండి శరత్‌బాబు, గీత, గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు