ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
బాల్య వివాహాలను అరికట్టాలి

బాల్యవివాహాలను అరికట్టాలి
(యువతరం ఆగస్టు 11) వెల్దుర్తి విలేఖరి;
బాల్యవివాహాలను అరికట్టాలి అని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో హాలులో బాల్య వివాహాల నిర్మూలనపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి నరసింహులు, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, సిడిపిఓ లుక్ తదితరులు పాల్గొన్నారు.