గర్భిణీలను మరియు బాధితులను వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద వంద శాతం రిజిస్టర్ చేయాలి

గర్భిణీలను మరియు బాలింతలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద వంద శాతం రిజిష్టర్ చేయాలి
జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్.
(యువతరం ఆగస్టు 9) విశాఖ ప్రతినిధి;
గర్భిణీలు మరియు బాలింతలను ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ పథకమునకు( టి హెచ్ ఆర్) శత శాతం రిజిష్టర్ చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసిడిఎస్ డిపార్ట్ మెంట్ సమీక్షా సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు, బాలింతలకు ఇచ్చే నిత్యావసర వస్తువులు బియ్యం, కందిపప్పు, నూనె, వైఎస్ఆర్ కిట్స్ పంపిణిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతినెలా సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్ డి జి ఇండికేటర్స్, బాలింతలో రక్తహీనత, బరువు తక్కువగా ఉన్న పిల్లలు, ఆయా వివరాలు అంగన్ వాడీ సూపర్ వైజర్లను అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు బరువు తక్కువ ఉన్న పిల్లల వద్దకు ప్రతి వారము డాక్టర్ను పంపించి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మళ్లీ వచ్చే సమావేశం నాటికి పూర్తి వివరాలు తీసుకురావాలని అంగన్ వాడీ సూపర్ వైజర్లను ఆదేశించారు. నాడు నేడు పనుల్లో భాగంగా అంగన్ వాడీ కేంద్రాల్లో పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ సూపర్ వైజర్లలకు పిల్లలు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి డి.వెంకటేశ్వరి, సిడిపిఓలు ఎం.వి రమణ కుమారి,డి నీలమణి, ఎం శ్రీదేవి, అంగన్ వాడీ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.