ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
ఘనంగా మొహర్రం వేడుకలు

ఘనంగా మొహర్రం వేడుకలు
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండల కేంద్రమైన వెల్దుర్తి తో పాటు, మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. దాదాపు గత పది రోజుల క్రితం పీర్ల స్వాములు, పీర్ల సావిడి లలో కొలువైన సంగతి తెలిసిందే. శనివారం తప్పెట దరువుల మధ్య పీర్ల స్వాములను ఏటికీ భక్తులు సాగనంపారు. కుల, మతాల కతీతంగా మొహర్రం వేడుకలలో భక్తులు పాల్గొన్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరు స్వామి వార్లను దర్శించుకున్నారు. యువకులు పీర్ల స్వాముల ముందు సావొసం తొక్కారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ వెల్దుర్తి ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి, అదనపు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు.