ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
రామళ్లకోటలో వింత ఘటన

రామళ్లకోటలో వింత ఘటన
వెల్దుర్తి యువతరం విలేఖరి;
వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామంలో శనివారం వింత ఘటన చోటు చేసుకున్నది. పీర్లు ఏటికి పోయే కార్యక్రమం నందు బార్ ఇమామ్ అనే స్వామి వారి పీరు ఏటికి పోయే సమయం ఆసన్నమైన కూడా స్వామివారి పీరు ఎంతకు కదలకపోవడంతో గ్రామ పెద్ద మనుషులు కలగజేసుకొని స్వామివారిని అడుగగా తనకు మూడు రోజుల జియారత్ తరువాత తిరిగి స్వామివారిని కూర్చోబెట్టాలని కోరడంతో గ్రామ పెద్దలు అందుకు ఒప్పుకున్నారు. అప్పుడు స్వామివారు కదిలినారు. కావున ఈ గ్రామంలో మూడు రోజుల తర్వాత బార్ ఇమామ్ స్వామి వారిని మాత్రమే పీర్ల పండుగ కొరకు మళ్ళీ కూర్చోబెట్టనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా
వెల్దుర్తి సర్కిల్ సి ఐ యుగoదర్, ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి గట్టి బందోబస్తు నిర్వహించారు.