పేదల ఆశయాలకు జగనన్న సురక్ష

పేదల ఆశయాలకి జగనన్న సురక్ష
డోన్ యువతరం ప్రతినిధి;
కొచ్చెరువు గ్రామంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ మండల ఎంపీపీ రేగటి రాజశేఖర రెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, మాజీ మార్కెట్ రామచంద్రుడు, డోన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. శ్రీనివాసులు, డోన్ తహసిల్దార్ విద్యాసాగర్, డోన్ గ్రామ పంచాయతీ విస్తరణ అధికారి కె. వరప్రసాద్ రావు, డోన్ డిప్యూట్ తాసిల్దార్ మధు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ రేగటి రాజా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ
2019 ఎలక్షన్ ముందు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినా ప్రతి పథకాన్ని కులాలకు మతాలకు రాజకీయాలకి అతీతంగా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుండే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని అమలు చేయడం జరిగిందని , చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేసిన ఏకైక ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
అదే విధంగా మన నియేజక వర్గంలో సంక్షేమ పథకాలతో పాటు దాదాపు 2400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియేజక వర్గం రూపు రేఖలు మార్చిన ఘనత మంత్రి బుగ్గన కే దక్కుతుందని తెలిపారు. మండల కేంద్రం నుండి ప్రతి గ్రామానికి రహదారులు, హైవే లో అండర్ పాస్, బ్రిడ్జిలు 326 కోట్లతో గొరుకల్లు రిజర్వ్యార్ నుండి ప్రతి ఇంటికి నీరు అందించడం జరుుగుతుందని పేర్కొన్నారు. 250కోట్లతో హంద్రీనీవా నుండి చెరువులు నింపడం, 185కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్,కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, 35 కోట్లతో 100పడకల ఆసుపత్రిని నిర్మించడం, 10 కోట్ల రూపాయలతో శ్రీ మద్దిలేటి స్వామి, శ్రీ కంభగిరి స్వామి,శ్రీ గుండాల చెన్నకేశవ స్వామి క్షేత్రాల అభివృద్ధి చేయడం,8 కోట్ల రూపాయల తొ టీటీడీ కల్యాణ మండపాలను,నిర్మించడం, డోన్ , ప్యాపిలి,బెతంచర్ల లో శాధి ఖాన లను ఆధునీకరణ, మరియు డోన్ లో కూరగాయల మార్కెట్ , మున్సిపల్ ఆఫీస్, ఆరు& బి గెస్ట్ హౌస్, నూతన ప్రభుత్వ కార్యాలయాలు,పార్కులు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు,డ్రైవింగ్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇండోర్ స్టేడియం, నగర వనం,సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ప్లై ఓవర్స్ వంటి అనేక అభివృద్ది కార్య క్రమాలు చేయడం జరిగిందని అన్నారు.తిరిగి 2024 ఎలక్షన్స్ లో మీరందరూ ఓట్లు వేసి గతంలో కన్న ఎక్కువ మెజారిటతో గెలిపించి మన అభివృద్ధిని కొనసాగిద్దాం అని తెలిపారు.కార్యక్రమము, అనంతరము అధికారులు, నాయకుల సమక్షంలో ప్రజలకు వివిధ రకాల సర్టిఫికెట్లను ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో, కొచ్చేరు గ్రామ సర్పంచ్ మంజుల ఎంపీటీసీ చింతలపేట సర్పంచ్ సూర్యచంద్ర కొమ్ము లక్ష్మీనారాయణ రమణయ్య శెట్టి చింతల పేట గంగాధర్ రెడ్డి సచివాలయం వెల్ఫేర్ భార్గవ్ డిస్టిలేస్టెంట మహిళా పోలీస్ వేదవతి ఏఎన్ఎం సునీత పంచాయతీ సెక్రెటరీ లక్ష్మీనారాయణ రెడ్డి ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.