ANDHRA PRADESHCRIME NEWSDEVOTIONAL
మొహర్రం పండుగను ప్రశాంతంగా జరుపుకోండి

మొహర్రం పండుగను ప్రశాంతంగా జరుపుకోండి
ఎస్సై వెంకటనారాయణ
అమడగూరు యువతరం విలేఖరి;
ఆమడగూరు మండలంలోని గ్రామాల్లో మొహరం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై వెంకటనారాయణ పేర్కొన్నారు. శనివారం మండలంలోని మహమ్మదాబాద్, కసముద్రం తదితర గ్రామాల్లో ఎస్సై వెంకటనారాయణ గ్రామస్తులతో మొహరం పండగపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటనారాయణ గ్రామస్తులతో మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా గ్రామాల్లో పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ మొహరం పండుగని అలాంటి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.